తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు TRS – USA ఆధ్వర్యంలో అమెరికా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తెరాస కార్యకర్తలు, నేతలు కేసీఆర్ గారి పుట్టినరోజును పండుగలా జరుపుకున్నారు. కేసీఆర్ గారు ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అభిమానులు ఆకాక్షించారు. కార్యకర్తలు కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తూ రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్నికి అతిథులు గా అప్లైడ్ మెటీరియల్స్ సి.టీ.ఓ శ్రీ ఓం నలమసు గారు, తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు. మహేష్ పాకాల గారు హాజరయ్యారు.
బే ఏరియాలో కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకల్లో నాయకులు పూర్ణ బైరి, అభిలాష్ రంగినేని, రజినీకాంత్ కొసానం, నవీన్ జలగం, భాస్కర్ మద్ది, శ్రీనివాస్ పొన్నాల, తేజస్విని వడ్డెరాజ్, రిషికేష్ ధర్మారెడ్డి, వంశీ కొండపాక, ఉదయ్ జొన్నల, ప్రదీప్ కురసాల, దిలీప్ రెడ్డి సేసాని, ఆశిష్ గౌడ్, గోవింద్, వంశీ, దత్తు, ప్రవీణ్, సాయి, నిహాల్, మనోజ్ దూలం తదితరులు పాల్గొన్నారు.