అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2న ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 8 గంటలకు, దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఆటా ప్రైమ్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత అతిధిగా హాజరుకానున్నారు. అనంతరం ఇదే సమావేశంలో బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఆటా నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు.
- Telangana Bhavan will be our centre of activity: KTR
- Musical chair game for CM post begins in the Congress party
- KCR honourably gives up all his official protocol
- We will accept the public mandate: BRS working president KTR
- BRS working president KTR asked cadre not to lose heart
- Centre intervenes in Nagarjuna Sagar dam row
- Three-fold GSDP growth in Telangana in the last 10 years
- All arrangements in place for counting of votes in Telangana
- Polling percentage came down in Telangana
- CM KCR confident of BRS party’s victory in assembly polls
- సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్గా ఉంటుంది… మేమే గెలుస్తున్నాం: కేటీఆర్
- ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్.. కామారెడ్డిలో కర్ణాటక ఎమ్మెల్యే
- ముంపు గ్రామ ప్రజలకు 12 కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తా: సీఎం కేసీఆర్
- ప్రజల హార్షాతిరేకాల నడుమ 96 ప్రజా ఆశీర్వాద సభల ప్రస్థానం
- వరంగల్లో రైల్వే లైన్లపై 6 బ్రిడ్జీలు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్