ఫలించిన చిరకాల స్వప్నం!!

  • December 18, 2020 3:14 pm

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ గ్రామానికి గత 20 ఏళ్లుగా సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఆ ఊరి ప్రజలు గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు తమ గోడు వెళ్ళబుచ్చినా పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి బాధను అర్ధం చేసుకుని సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆ ఊరికి రోడ్డు సౌకర్యం కల్పించి వారి చిరకాల స్వప్నం సాకారం చేశారు. రూ. 85 లక్షలు మంజూరు చేయించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టారు.

శుక్రవారం రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డికి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. డప్పు చప్పుళ్లతో, మంగళ హారతులతో, కోలాట కళాకారుల బృందాలతో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. తమ కలను నెరవేరేలా చేసిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రోడ్డును ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు గారి పరిపాలనలో ప్రతి గ్రామం అభివృద్ధివైపు పరుగులు పెడ్తున్నదని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి గ్రామ పంచాయితీకి నేరుగా నిధులు సమకూరుస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ధర్మారెడ్డి ప్రశంసించారు.


Connect with us

Videos

MORE