mt_logo

జాతీయ అవార్డుకు ఎంపికైన మిషన్ కాకతీయ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం మరోసారి జాతీయ అవార్డు గెలుచుకుంది. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ గవర్నెన్స్‌ విభాగం ఇంజినీర్లు తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ జాతీయస్థాయిలో స్కోచ్‌ అవార్డ్‌కు ఎంపికైంది. ఎల్‌ఏఎంఎం పేరిట తయారుచేసిన ఈ సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌ యాప్‌తో చెరువుల స్థితిగతులు, నీటినిల్వ, పునరుద్ధరణ పనుల ప్రగతి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. అలాగే వరద నివారణ చర్యలను సమర్థవంతంగా నిర్వహించి నిధులు ఆదా చేయవచ్చు. ఇటీవల వర్చువల్‌గా నిర్వహించిన స్కోచ్‌ 75వ సమ్మిట్‌లో ఈ గవర్నెన్స్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రామాంజనేయులు అవార్డు అందుకున్నారు. మిషన్‌ కాకతీయకు అవార్డు దక్కడంపై రాష్ట్ర సాగునీటిరంగ నిపుణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ పథకం ఇప్పటికే 2018లో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ నుంచి బెస్ట్‌ ఇరిగేషన్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును దక్కించుకున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *