దేవాలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి : మంత్రి సత్యవతి రాథోడ్

  • January 12, 2022 8:30 pm

అదిలాబాద్ ఇంద్రవెళ్ళి మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాథోడ్ సత్యవతి. నాగోబా గిరిజన పూజారులైన మెస్రం వంశీయులతో కలిసి నాగోబాను దర్శించుకున్న అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… వచ్చే ఏడాది వరకు అంగ రంగ వైభవంగా నాగోబా ఆలయాన్ని తీర్చిదిద్దుతామని… నాగోబా, జోదేఘడ్, జంగు భాయి ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు . దేవాలయ నిర్మాణ పనులకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.5 కోట్లు ఇచ్చాము. నాగోబా ఆలయం నిర్మాణం చూస్తే ఒక 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయాలని తలపించేలా ఉందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… కెస్లాపూర్ నాగోబా జాతరకు 50 లక్షలు కేటయించడం జరిగిందన్నారు. ఇంకా ఐదు కోట్లు అవసరం ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. నాగోబా, జోడెఘట్, సెవాలాల్ మందిరాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్ఏ అజ్మీరా రేఖ, బోథ్ ఎంఎల్ఏ రాథోడ్ బాపురావ్, అదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, నిర్మల్ జడ్పీ చైర్ పర్సన్, మాజీ ఎంపీ గొడం నగేష్, ఇంద్రవెళ్ళి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్ లతో పాటు మేశ్రం వంశీయులు ఉన్నారు.


Connect with us

Videos

MORE