నిరుపేదల అభివృద్ధి,సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బంజారాహిల్స్ లోని శ్రీరామ్ నగర్ లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే మల్టి పర్ఫస్ కమ్యూనిటీ హాల్ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మితో కలిసి మంత్రి తలసాని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ… నిరుపేదలు నివసించే బస్తీల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి కేటీఆర్ నిరంతర కృషి కారణమని కొనియాడారు.
