శుక్రవారం మహబూబ్‌నగర్ గ్రామీణ మండలం కోట కదిర జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్సయిజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తర్వాత విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్… శివాని అనే తొమ్మిదో తరగతి విద్యార్థినికి గోరుముద్దలు తినిపించారు. అనంతరం శివాని.. మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అక్షయపాత్ర ద్వారా శుక్రవారం నుంచి 4947 మంది విద్యార్థులకు 47 పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకోవాలని కష్టపడి చదివితే అన్ని విధాలా అండగా ఉంటామని ఆశీర్వదించారు. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యా పరంగా అనేక మార్పులు వచ్చాయని, రాష్ట్ర వ్యాప్తంగా వేయి గురుకులాలు పెడితే మహబూబ్‌నగర్‌లోనే 20 ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.