mt_logo

ఖమ్మంలో ఐటీ హబ్ ను సందర్శించిన మంత్రి పువ్వాడ అజయ్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనేక సంస్థలను ఆహ్వానిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఐటీ అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ టెక్నాలజీగా మారిపోతుంది అభివర్ణించారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలని భావించి రాష్ట్రంలో ఖమ్మంకు సుప్రసిద్ధ స్థానం కల్పించాలనే భావంతో ఖమ్మంకు ఐటీ హబ్ ను తేవడం జరిగిందన్నారు.

ఖమ్మం నగర నడిబొడ్డులో కోట్ల రూపాయల స్థలంలో 25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ హబ్(ట్విన్ టవర్స్)ను మంత్రి సందర్శించారు. ఆయా సేవలు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. ఇప్పటికే పనులు పూర్తి కావచ్చాయని, IT శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదగా వచ్చే నెల ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో నిరుద్యోగులకు ఐటీ హబ్ కల్పవల్లిగా మారబోతోందని వ్యాఖ్యానించారు. స్థానికులకు ముందు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న సాకేతికతను వినియోగించుకుని అభివృద్ధి వైపు పయనం సాగించాలని అందుకు తెలంగాణ ప్రభుత్వం ఐటీ ని ప్రోత్సహిస్తుందన్నారు.

ఐటీ టవర్‌లోని కంపెనీల్లో ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇప్పటికే అందజేశామని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో టాలెంట్ కేవలం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాల విద్యార్థులకే సొంతం కాదన్నారు.

ద్వితీయ శ్రేణి నగరాల్లోకి ఐటీ.. ఐటీ నిర్వచనం మారిందని, ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోని నైపుణ్యవంతులైన యువత ఇతర నగరాలకు వలస పోవాల్సి వస్తోందని, ఐటీ నిర్వచనం మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదని.. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ పురోభివృద్ధిపై పలు అనుమానాలు ఉండేవని.. ఇప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. అప్పట్లో ఐటీ ఎగుమతులు తక్కువగా ఉండేవని, ప్రస్తుతం ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఐటీ ఎగుమతులు రూ. 1.28 లక్షల కోట్లకు చేరాయని వివరించారు.

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం మరిన్ని ఐటీ సంస్థలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. జిల్లా యువతకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని అర్హులైన వారికి ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ చావా నారాయణ రావు, ఇతర అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *