mt_logo

భద్రాద్రి కొత్తగూడెంలో కోవిడ్ అంబులెన్సులను ప్రారంభించిన పువ్వాడ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటుచేసిన కోవిడ్ అంబులెన్సులు, కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వెహికల్ ను స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుతో కలిసి రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని అన్నారు.

అనంతరం ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డులో కొత్తగా ఏర్పాటుచేసిన వెంటిలేటర్లను మంత్రి ప్రారంభించారు. కరోనా పాజిటివ్ వస్తే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక్క పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా చికిత్సను అందజేస్తామని పేర్కొన్నారు.

మంత్రి విజ్ఞప్తి మేరకు గత సంవత్సరం హౌసింగ్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో) సంస్థకు లేఖ వ్రాయగా స్పందించిన ఆ సంస్థ రూ. 60.69 లక్షల విలువైన అధునాతన అంబులెన్సులను మంజూరు చేసింది. కోవిడ్ కష్టకాలంలో ఆయా అంబులెన్సులను వినియోగించనున్నట్లు పువ్వాడ అజయ్ తెలిపారు. హడ్కో సమకూర్చిన అంబులెన్సుల్లో జిల్లా దవాఖానకు 1 అంబులెన్స్, భద్రాచలం ఏరియా దవాఖానకు 1 అంబులెన్స్, రాష్ట్ర ప్రభుత్వం నుండి 1 అంబులెన్స్, ఆర్టీసీ నుండి సంచార కోవిడ్ టెస్ట్ వాహనం 1 లను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, ఆర్టీసీ ఆర్ఎం కృష్ణమూర్తి, డీఎం శ్రీహర్ష, వైద్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *