mt_logo

సీఎం కేసీఆర్ కు రైతులపై చాలా ప్రేమ ఉంది- నాబార్డ్ ఛైర్మన్

ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావుకు రైతులపై చాలా ప్రేమ ఉందని, గురువారం సీఎంతో జరిగిన సమావేశంలో అది స్పష్టంగా కనపడిందని నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు పేర్కొన్నారు. నాబార్డ్ ఛైర్మన్ గా ఎన్నికై మన రాష్ట్రం, మన ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి సీతారాంపేట గ్రామ సమీపంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి నాబార్డు ఛైర్మన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నాబార్డు నుండి రూ. 60 నుండి 70 వేల కోట్లు ఇవ్వాలనుకున్నామని తెలిపారు.

రాష్ట్రంలో బ్యాంకులను మోడల్ బ్యాంకులుగా మార్చాలని సూచించారు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని తాను కోరుకుంటున్నానని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కువ వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తారు. వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని, నిరుపేదలను ఆదుకున్నప్పుడే దేశం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇతర నేతలు, అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *