వనపర్తి జిల్లా అభివృద్ధికి ప్రజలు పూర్తి సహకారాలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ‘నగరంలో నిబంధనల ప్రకారము రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇంకా ఏవైనా అనధికార కట్టడాలుంటే తొలగించాలి’ అని అధికారులకు సూచించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి చేయించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులను మంత్రి అభినందించారు. వారంలోపు కరెంటు పోల్స్ పనులు పూర్తి చేస్తామని విద్యుత్ ఎస్‌ఈ వివరించారు. అనంతరం పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు డివైడర్ పనులు వేగవంతం చేయాలని, మున్సిపాలిటీలలో సమావేశం ఏర్పాటు చేసుకొని పనుల పురోగతిపై చర్చించాలని కలెక్టర్ ను ఆదేశించారు. చిట్యాల లోని డబల్ బెడ్ రూమ్ లలో ట్రాన్స్‌ఫార్మర్లు , మీటర్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు సమావేశంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, అదనపు కలెక్టర్ ఆశీస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
