వాణిజ్య పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల వ్యవసాయ అధికారులకు, రైతుబంధు సమితి సభ్యులకు వానాకాలం సాగు సన్నద్ధతపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీడు భూములన్ని పలు రకాల పంటలతో కళకళలాడుతున్నాయని తెలిపారు. 2020-21 సంవత్సరంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ పండించిందని గుర్తు చేశారు. ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయని, వాటికి అనుగుణంగా తృణ ధాన్యాలు, ఉద్యానవన పంటలను కూడా పండించాలని మంత్రి సూచించారు. ఇవాళ నూనె గింజల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తామన్నారు. భవిష్యత్‌లో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఆముదం పంటకు కూడా అద్భుతమైన లాభాలు వస్తాయి. పంట మార్పిడి వల్లనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. వ్యవసాయ అధికారులు పర్యటనలు చేసి, కొత్త కొత్త వ్యవసాయ విధానాలు తెలుసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.
- Fear grips Hyderabad as HYDRAA resumes demolition of properties
- Sircilla textile industry, once thriving under KCR, now plunged into deep crisis
- Public participation and engagement seen in 2014 comprehensive survey missing in 2023 caste survey
- Privacy concerns in caste survey as some enumerators insist on personal details
- KTR urges PM Modi to take action on AMRUT tenders scam in Telangana
- పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్
- రేవంత్ అల్లుడి కంపెనీ కోసమే కొడంగల్‌లో ఫార్మా చిచ్చు: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలయింది: హరీష్ రావు
- పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం: కేటీఆర్
- తోటి మనిషి బాగును కోరుకోవడమే కాళోజీకి మనమందించే ఘన నివాళి: కేసీఆర్
- ప్రజా గొంతుక.. ధిక్కార ప్రతీక కాళోజీ: కేటీఆర్
- సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. ముందు ముందు 70 ఎంఎం సినిమా ఉంది రేవంత్ రెడ్డికి: హరీష్ రావు
- ప్రభుత్వంలో మంత్రులు దళారులు, మిల్లర్లతో కుమ్మక్కయ్యారు: జగదీశ్ రెడ్డి
- తెలంగాణలో జరిగిన అమృత్ టెండర్ల స్కాంపైన ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలి: ఢిల్లీలో కేటీఆర్
- అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం చేసిన రేవంత్: కేంద్ర మంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ ఫిర్యాదు