mt_logo

ఐఎఫ్ఎల్ టైటిల్ సాధించిన హైదరాబాద్ జట్టుకు మంత్రి కేటీఆర్ అభినందనలు

ఇండియ‌న్ ఫుట్‌బాల్‌ సూప‌ర్ లీగ్‌లో చాంపియన్‌గా అవతరించిన హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (హెచ్‌ఎఫ్‌సీ)కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నాలుగు నెలల పాటు ఆసక్తికరంగా కొనసాగిన ఈ సూపర్ లీగ్ లో హెచ్‌ఎఫ్‌సీ హోరాహోరీగా తలపడింది. ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. తుది పోరులో నిలిచిన తొలిసారే కప్‌ను ముద్దాడి కొత్త చరిత్ర లిఖించింది. ఆదివారం ఆద్యంతంఆసక్తికరంగా సాగిన ఫైనల్‌ పోరులో హెచ్‌ఎఫ్‌సీ కేరళ బ్లాస్టర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. అభిమానులు ఊపిరి బిగపట్టుకుని మునివేళ్లపై మ్యాచ్‌ను వీక్షించిన వేళ.. హలీచరణ్‌ గోల్‌తో హైదరాబాద్‌ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. మొత్తంగా దేశ ఫుట్‌బాల్‌ యవనికపై హైదరాబాద్‌ పేరు మరోమారు మార్మోగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *