mt_logo

బధిర ఛాంపియన్ కు ఆర్థిక సహాయం అందివ్వనున్న మంత్రి కేటీఆర్

అవసరమైన చోట తక్షణమే తన ఆపన్నహస్తం అందించే రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ మరోమారు తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. అనేక అంతర్జాతీయ వేదికల మీద పథకాలు సాధించిన ఓ బధిర బాలికకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాలికా హండా వరల్డ్, ఆసియన్ ఛాంపియన్‌షిప్‌సలో ఆరు పతకాలు సాధించింది. డెఫ్ స్పోర్ట్ చెస్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించింది. జాతీయస్థాయిలో నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్‌ను ఏడుసార్లు గెలుచుకుంది. ఇన్ని పతకాలు, అవార్డులు సాధించిన మాలికకు పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు. డెఫ్ స్పోర్ట్‌కు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలంటి పాలసీ లేదని అధికారులు తప్పించుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని మాలికా.. తన ఆగ్రహాన్ని, బాధను సైన్ లాంగ్వేజ్‌లో చెప్పుకుంటూ ఒక వీడియో చేసింది. ఈ పోస్ట్.. తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. ‘ఈ యువ ఛాంపియన్ వివరాలు తెలియజేయండి. నేను వ్యక్తిగతంగా చేతనైన సాయం చేస్తాను’ అని కెటిఆర్ ట్వీట్ చేయగా.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాలికా హండగా వివరాలు అందాయి. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది మాలికా హండా కుటుంబసభ్యులను సంప్రదించారు. పంజాబ్‌కు చెందిన తన కూతురికి సుదూరంలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ సహాయం అందించేందుకు ముందుకు రావడంపై మాలిక కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *