mt_logo

మతం పేరిట రెచ్చగొడితే ఊరుకునేది లేదు : మంత్రి కేటీఆర్ హెచ్చరిక

రాష్ట్రంలో మ‌తం పేరుతో కలహాలు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తే ఊరుకోమని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ హెచ్చ‌రించారు. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాం. హైద‌రాబాద్ లోని పాతబస్తీలో రూ. 495 కోట్ల‌తో పలు అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత హైద‌రాబాద్‌లోనే కాదు, రాష్ట్రంలో కూడా మతం పేరిట‌ రాజకీయాలు చేయలేదు.. ప‌నికిమాలిన పంచాయ‌తీలు లేవు అని స్ప‌ష్టం చేశారు. కులాలు, మ‌తాల పేరిట ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెట్ట‌లేదు. ఆ చిచ్చులో చ‌లిమంట‌లు కాచుకునే ప్ర‌య‌త్నం ఎప్పుడూ చేయ‌లేదు.. చేయ‌బోమ‌ని తేల్చిచెప్పారు. కొన్నేండ్ల క్రితం హైద‌రాబాద్‌లో ప్ర‌తి ఏడాది ఐదు నుంచి ప‌ది రోజుల పాటు క‌ర్ఫ్యూ విధించేవారు. కానీ కేసీఆర్ నాయ‌క‌త్వంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను ప‌టిష్టంగా కాపాడుకుంటున్నామ‌ని తెలిపారు. మ‌తం పేరిట ఎవ‌రైనా చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేసినా ఉక్కుపాదంతో అణ‌చివేస్తున్నామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో తమ ప్రభుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుందని అన్నారు. కులం, మ‌తం పేరు మీద రాజ‌కీయం చేసే విధ్వంస‌క‌ర శ‌క్తుల‌ను, చిల్ల‌ర‌మ‌ల్ల‌ర వ్య‌క్తుల‌ను ఒక కంట క‌నిపెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *