mt_logo

భారతదేశపు మొట్టమొదటి హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ విజయవంతం : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించే తెలంగాణ పైలట్ ప్రాజెక్ట్ పురోగతిలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ దిగ్విజయంగా కొనసాగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సానుకూల సామాజిక ప్రభావం కోసం సాంకేతికతను ఉపయోగించుకోవడంలో తెలంగాణ మళ్లీ టార్చ్ బేరర్ అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘పౌరులందరి డిజిట్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించే పైలట్ ప్రాజెక్ట్ మార్చి 5న ములుగు, సిరిసిల్ల జిల్లాలో ప్రారంభించబడి, వేగంగా పూర్తవుతోంది. పౌరుల ఆరోగ్య వివరాలను నమోదు చేయడానికి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు తనిఖీలు నిర్వహిస్తున్న కొన్ని చిత్రాలను కూడా మంత్రి పోస్ట్ చేశారు. ములుగు, సిరిసిల్ల జిల్లాలలో భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్‌గా ప్రశంసించబడుతున్న దీనిని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టి.హరీష్‌రావు మార్చి 5న ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పౌరులందరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించే పైలట్ ప్రాజెక్ట్.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *