ప్రపంచ దిగ్గజ గూగుల్ కంపెనీ తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పటంలో కీలక పాత్ర పోషించిన ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్టు, దైనిక్ భాస్కర్ పత్రిక తరఫున వైట్‌హౌజ్ కార్యకలాపాలు చూసే రోహిత్ శర్మ కేటీఆర్‌ను కొనియాడుతూ… ఇపుడు హైదరాబాద్‌లో అంతా కేటీఆర్ గురించే చర్చ అని వ్యాఖ్యానించారు. యథార్థ్ మిశ్రా అనే వ్యక్తి ‘అమెరికా బయట గూగుల్ స్థాపించబోయే అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో కొలువుదీరనున్నది. ఇది ప్రభుత్వం సరైన సమయంలో స్పందించటం వల్లే సాధ్యమవుతున్నది. గూగుల్‌ను సరైన ప్రదేశంలో నెలకొల్పుతున్నారు. దూరదృష్టి గల కేటీఆర్ నాయకత్వానికి జోహార్లు’ అని ట్వీట్ చేయగా, దాన్ని రీట్వీట్ చేసిన రోహిత్ శర్మ.. ‘ఇది అత్యద్భుతం. ఈ మధ్యే హైదరాబాద్‌ను సందర్శించాను. స్థానికులు కేటీఆర్ గురించి చెప్పడానికి పిచ్చెక్కిపోతున్నారు. గూగుల్ ఇండియా సురక్షితుల చేతుల్లో ఉన్నది’ అని ట్వీట్ చేశారు.