mt_logo

‘గుజరాతీలనైనా పట్టించుకోండి…’ పీయూష్ గోయల్ మీద సెటైర్ వేసిన మంత్రి కేటీఆర్

చేనేతపై వస్త్ర పరిశ్రమపై పెంచిన జీఎస్టీని తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా.. ఆ విఙ్ఞాపణను కేంద్రం ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్. ఇపుడు గుజరాత్ బీజేపీ ప్రెసిడెంట్ సీఆర్ పాటిల్ తో పాటు, కేంద్రమంత్రి దర్శన్ జర్దోష్ లు కూడా వస్త్ర పరిశ్రమపై 12 శాతానికి పెంచిన జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారని, కనీసం వారినైనా పట్టించుకోండి అంటూ కేంద్ర చేనేత జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ మీద సెటైర్ వేసారు కేటీఆర్. కాగా ఇటీవల చేనేత వస్త్ర పరిశ్రమపై 12 శాతం జీఎస్టీ పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. చేనేత సంఘం నేతలు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నాలు చేసేందుకు సిద్ధమయ్యారు. చేనేతపై జీఎస్టీ తగ్గించాలని బీజీపీయేతర పార్టీలే కాకుండా ఆ పార్టీకి చెందిన వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలుపుతూ ..’ మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోక‌పోయినా.. క‌నీసం గుజ‌రాత్‌ను అయినా ప‌ట్టించుకోవాల‌ని” కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు కేటీఆర్ చురకలు అంటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *