తాజాగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ‘ మహిళలకు మంచి రోజులు వచ్చేశాయ్.. అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. ఇది మహిళలకు ప్రధాని మోదీ కానుకగా ఇచ్చేశారు’ అని సోషల్ మీడియా వేదికగా సెటైర్స్ వేశారు. గృహావసరాల కోసం వినియోగించే 14 కేజీల సిలిండర్‌పై కేంద్రం రూ.50 వడ్డించింది. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది. తాజా పెంపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1053కు పెరిగింది. దీంతో పాటు ఐదు కేజీల డొమెస్టిక్ సిలిండర్‌పై మరో రూ.18 భారం మోపింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.