mt_logo

హైదరాబాద్ లో వివిధ అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైద‌రాబాద్ న‌గ‌రంలో చేప‌ట్టిన అభివృద్ధి పనుల‌పై, ఫార్మూలా ఈ రేస్ నిర్వ‌హ‌ణ‌పై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం స‌మీక్షా సమావేశం నిర్వ‌హించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం మరియు సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం కింద నగరంలో కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్వ‌హ‌ణ‌, ఫుట్‌పాత్‌, కూడ‌ళ్ల అభివృద్ధిపై దృష్టి సారించాల‌ని అధికారుల‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. లింకు రోడ్ల నిర్మాణం సత్ఫ‌లితాలు ఇస్తోంది కాబట్టి మ‌రిన్ని లింకు రోడ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు పూర్తి చేయాల‌ని అధికారులకు తెలిపారు. నాలాల పురోగ‌తి, పూర్త‌యిన నాలాల నిర్మాణ వివ‌రాలను న‌గ‌ర పౌరుల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. కాగా వ్యూహాత్మ‌క నాలాల అభివృద్ధి ప‌నులు దాదాపు పూర్త‌య్యాయ‌ని అధికారులు మంత్రికి వివ‌రించారు. అలాగే ఫార్మూలా ఈ రేస్ ఏర్పాట్లను త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పుర‌పాలక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *