ఎవ్వరు ఎలాంటి సహాయం అడిగినా సహాయం చేసేందుకు ముందుంటారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. తాజాగా ఓ రైతు తన కష్టాన్ని చెప్పుకోవటం.. మంత్రి కేటీఆర్ నిమిషాల్లో దానికి స్పదించటం జరిగిపోయాయి. రెండు సంవత్సరాలుగా మా పొలంలో కరెంటు తీగలు పెద్ద లైను కిందికి వచ్చాయని.. కంప్లైంట్ ఇస్తే అధికారులు ఎవరు పట్టించుకోవటంలేదని.. మీరే మాకు హెల్ప్ చేయాలనీ కేటీఆర్ కి ఒక రైతు మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. రైతు తన సమస్యను చెబుతూ ట్వీట్ చేసిన నిమిషాల్లోనే మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులకు వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని సూచనలు చేశారు. కేటీఆర్ కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని ఆ రైతుకు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కాగా తన సమస్యపై తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇలా మంత్రి కేటీఆర్ క్షణాల్లో రైతు సమస్యకి పరిష్కారం చూపటంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయా నాయకులు అందరు ఇలాగే స్పందిస్తే అభివృద్ధిలో భారతదేశం పరుగులు పెడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

