హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలపై దృష్టి సారించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
ఇబ్రహీంపట్నం చెరువు వద్ద రిసార్ట్‌తో పాటు బోటింగ్ కాయకింగ్ పారాసైలింగ్ వంటి ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకువస్తే పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతుందని, అందుకుగల అవకాశాలను పరిశీలించాలని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో నిర్మించిన ఈ చెరువు అభివృద్ధికి గల అవకాశాలను అన్వేషించి, వెంటనే పనులు మొదలు పెట్టాలని హెచ్‌ఎండీఏ అధికారులకు సూచించారు.