mt_logo

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం… ఫలించిన మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన

తెలంగాణకు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం జరిపిన సమావేశాల అనంతరం… హైదరాబాద్‌ ఫార్మా రంగంలోకి యునైటెడ్‌ స్టేట్స్‌ ఫార్మా కొపియా సంస్థ కూడా చేరనున్నది. రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని జీనోమ్‌వ్యాలీలో ఏర్పాటు చేయనున్నట్టు. మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఆ సంస్థ చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ కేవీ సురేంద్రనాథ్‌ తెలిపారు. గత ఐదేండ్లలో ఇక్కడ 5 మిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టి 70 మందికి ఉద్యోగాలు కల్పించామని, తాజాగా ఏర్పాటుచేయనున్న అడ్వాన్స్‌డ్‌ ల్యాబ్‌లో మరో 50 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందని వెల్లడించారు. 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటుచేసే అత్యాధునిక ల్యాబ్‌కు సింథటిక్‌, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటుందని వివరించారు.

క్యూరియా గ్లోబల్ సర్వీసెస్ సెంటర్ విస్తరణ :

న్యూయార్‌ కేంద్రంగా గల క్యూరియా గ్లోబల్‌ (గతంలోAMRI Global ) హైదరాబాద్‌లోని తన కేంద్రాన్ని విస్తరించి ఉద్యోగుల సంఖ్యను ఏడాదిలోగా రెట్టింపు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఈ కంపెనీ మనదేశంలో 27 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇతర క్యూరియా గ్రూప్‌ సంస్థలు, థర్ట్‌ పార్టీ సంస్థల కోసం ఔషధ తయారీ, ఒప్పంద పరిశోధన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తున్నది. క్యూరియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌ పాండియన్‌తో మంత్రి కేటీఆర్‌ సమావేశం తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. హైదరాబాద్‌లోని గ్లోబల్‌ షేర్డ్‌ సర్వీస్‌ సెంటర్‌లో ప్రస్తుతం 115 మంది ఉద్యోగులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *