mt_logo

ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసిన మంత్రి కేటీఆర్

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ అనంతరం మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. అక్కడ స్వామి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా స్వామితో పాటు తల్లిదండ్రుల యోగక్షేమాలను, ఇంటి నిర్మాణం, హెయిర్ కటింగ్ సెలూన్ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని స్వామికి హామీ ఇచ్చారు.

గతంలో అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని వ్యక్తిగతంగా కేటీఆర్‌ ఆర్థిక సహాయం అందించారు. దాంతో పాటు ప్రభుత్వం నుంచి డబుల్‌ బెడ్రూం కోసం రూ.5.50లక్షలు మంజూరు చేయించారు. మిగతా ఇంటి నిర్మాణ పనులను కార్యాలయంతో పర్యవేక్షించి, పూర్తి చేసేలా చొరవ చూపారు. మంత్రి ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కర్నాటి విద్యాసాగర్‌రావు ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *