పెట్టుబడులకు గమ్యస్థానం అయిన హైదరాబాద్‌కు ఆధునిక ఆటోమొబైల్ రంగంలో అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కోకాపేట్‌లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ జీసీసీ సంస్థను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. అమెరికాకు చెందిన అగ్రశ్రేణి ఆటో మొబైల్ సంస్థ అయిన ఆటో పార్ట్శ్ జీసీసీ హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని కేటీఆర్ స్వాగతించారు. హైదరాబాద్‌లో వ్యాపారాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థను 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయగా… సుమారు 450 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ తెలియ జేశారు. అలాగే నగరంలో వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా-ఈని ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు.