మంత్రి కేటీఆర్ తక్షణం స్పందించడం వల్ల ఇద్దరు యువకులు ప్రాణాలతో బతికి బయట పడ్డారు. వివరాల్లోకి వెళితే… చెన్నూరు సోమన్ పల్లి దగ్గర గోదావరి నది వరద ప్రవాహంలో ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. స్థానికులు విషయాన్ని ఎమ్మెల్యే బాల్క సుమన్ కి తెలపగా… సహాయం చేయవలసిందిగా ఐటి, మున్సిపల్ మంత్రి కెటిఆర్ ను కోరారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ విపత్తు నిర్వహణ యంత్రాంగం హెలికాప్టర్ తెప్పించి ఇద్దరు ప్రాణాలను కాపాడారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సహాయక చర్యలను స్వయంగా ఎమ్మెల్యే బాల్కసుమన్ పర్యవేక్షించారు. బాధిత యువకులు మంత్రి కేటీఆర్ కు, ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ధన్యవాదాలు తెలిపారు.