mt_logo

కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు… కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎట్టకేలకు కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. ప్రాజెక్టుకు ఎగువ నుండి వస్తున్నా వరద ఉధృతి తగ్గటంతో ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. అంతకు ముందు వాటర్ ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండి.. అవుట్ ఫ్లో తక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్ తెగిపోతుందని అధికారులు, ముంపు గ్రామ ప్రజలు ఆందోళన పడ్డారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… వరద తగ్గడంతో ప్రస్తుతానికి ప్రాజెక్ట్ సేఫ్ జోన్ లో ఉందని, వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు కాగ… ఔట్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉందని.. మొత్తం 17 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్ననామని, వరద ఉద్దృతిని బట్టి క్రమంగా గేట్లను దించేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. భయానక పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన నీటిపారుదల అధికారులు, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్లో నిమగ్నమైన కలెక్టర్ ముష్రఫ్, ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *