రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ రెండవ రోజు లండన్ పర్యటన విజయవంతం అయింది. పలు కంపెనీల అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యి… రాష్ట్రంలో పెట్టుబడుల అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇందులో భాగంగా క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ హాల్ఫార్డ్, ప్రో వైస్ ఛాన్స్లర్ పోల్లార్డ్ లు మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏరోనాటికల్ యూనివర్సిటీ ప్రయత్నాల పట్ల తాము ఆసక్తిగా ఉన్నట్లు క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ అధికారులు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. ప్రపంచ స్థాయి ఏరోనాటికల్ యూనివర్సిటీ తెలంగాణ కేంద్రంగా తీసుకువచ్చే తమ ప్రయత్నంలో కలిసి రావాలని ఈ సందర్భంగా కేటీఆర్ క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ బృందానికి విజ్ఞప్తి చేశారు.

