mt_logo

పేదింటి విద్యా కుసుమాలకు మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం

ఇద్దరు పేదింటి విద్యా కుసుమాలకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. అందులో ఒకరు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ సీటు సాధించగా, మరొకరు నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబీఎస్ సీటు సంపాదించాడు. వివరాల్లోకి వెళితే… సూర్యాపేట్ జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు పిడమర్తి ప్రసాద్ కుమారుడు అనిల్ కుమార్‌కు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అప్లైడ్ జియాలజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వల్ల చదువు కొనసాగించ లేకపోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్… అనిల్ కుమార్ విద్యకు కావలసిన ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా బుధవారం ప్రగతి భవన్ లో అనిల్ కుటుంబ సభ్యులను కలిసి, చదువు పూర్తయ్యాక అమ్మా నాన్నలను మంచిగా చూసుకోవాలని, ఇతరులకు సాయపడాలని అనిల్ కు తెలిపారు.

మహబూబ్‌నగర్‌కు చెందిన మరో విద్యార్థి అయిన ప్రశాంత్ రెడ్డి ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన నీట్ పరీక్షలో 723 ర్యాంకు సాధించి సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబీఎస్ సీటు పొందాడు. తండ్రి ఆటో నడిపితే గానీ కుటుంబం గడవలేని పరిస్థితిలో ఉండగా… తన మెడిసిన్ చదువు ఖర్చులకు సాయం అర్ధిస్తూ మంత్రి కేటీఆర్ గత నెలలో ట్వీట్ చేసాడు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ బుధవారం ప్రశాంత్ రెడ్డిని తన కార్యాలయంలో కలిసి అతని చదువు ఖర్చులకు అవసరమైన ఆర్థిక సాయం అందించాడు. డాక్టర్ అయ్యి పేదప్రజలకు సేవలు అందించాలని మంత్రి కేటీఆర్ ప్రశాంత్‌ రెడ్డికి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *