mt_logo

లక్ష్యంతో చదవండి… ప్రభుత్వ ఉద్యోగం సంపాదించండి : తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ 

తెలంగాణలో కొలువుల కుంభమేళా కొనసాగుతున్నదని.. యువత ఉద్యోగ సాధన కోసం అకుంఠిత దీక్షతో సిద్ధం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో చదివి ఉద్యోగాలు సాధించి కుటుంబానికి అండగా నిలబడాలని ఆయన సూచించారు. అనవసర విషయాలు, విద్వేష రాజకీయాలకు ఏమాత్రం ప్రభావితం కాకుండా మనసుపెట్టి చదవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం మంత్రి కేటీఆర్‌ తెలంగాణ యువతకు ఆత్మీయ లేఖ రాశారు.

పూర్తిలేఖ ఇదీ….

“మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వర్తమానంలో అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకున్నది. వ్యవసాయం,సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్‌ మాడల్‌గా నిలిచింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ దేశంలో నవశకానికి నాంది పలికింది. ఎన్నో ఆంక్షల నడుమ స్వరాష్ట్రంలో స్వపరిపాలనను మొదలుపెట్టి 9 ఏండ్ల వ్యవధిలో సుమారు 2.25 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా దేశచరిత్రను సరికొత్తగా లిఖించబోతున్నదని చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది.

ఉద్యమకాలంలో, అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను టీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీకి అనుగుణంగా లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను మొదటిసారి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వం లో విజయవంతంగా పూర్తిచేశాం. ప్రజల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి వచ్చాక.. 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత నిబద్ధతతో వేగంగా చేపట్టినం. ఇప్పటికే సుమారు 32వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తోపాటు ఇతర శాఖల నుం చి నోటిఫికేషన్లు ఇచ్చాం. గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నాం. మొత్తంగా 2 లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను అతితకువ సమయంలో భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతున్నది.

ఇక ఉద్యోగాల భర్తీలో స్థానికులకే అధిక ప్రాధాన్యం దకాలన్న ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడానికి సీఎం కేసీఆర్‌ ఎనలేని కృషి చేశారు. అడ్డంకిగా ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడంతో ఆఫీస్‌ సబార్డినేట్‌ నుండి ఆర్‌డీవో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95శాతం స్థానికులకే దకుతున్నాయి. సీఎం కేసీఆర్‌ తెచ్చిన కొత్త జోనల్‌ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఫలించింది. దీంతోపాటు విద్యార్థులు, యువకుల కోరిక మేరకు కేసీఆర్‌ నేతృత్వంలోని మా ప్రభుత్వం వయోపరిమితిని సడలించింది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పాల్గొనేందుకు మరింత మందికి అవకాశం దకింది.

నిరుద్యోగ యువత కోసం ఒకవైపు సర్కారీ కొలువులను భర్తీ చేస్తూనే.. ఏండ్లతరబడి ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరించాం. త్వరలోనే మరో 10 వేల మంది ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించనున్నామని తెలపడానికి సంతోషంగా ఉంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో మాత్రమే కాకుండా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, గురుకుల విద్యాసంస్థలతో ప్రత్యేక బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వికేంద్రీకరించాం. ఫలితంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సమూలంగా మారి నియామకాలు వేగంగా జరుగుతున్నాయి.

విద్వేష రాజకీయాలకు దూరం ఉండండి..లక్ష్యంవైపు గురిపెట్టండి

ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగపర్వం నడుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు నేనిచ్చే సలహా ఒకటే. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోకండి. అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టండి. కాలం తిరిగి రాదు. అవకాశాలను అందిపుచ్చుకోండి. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రణాళికతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించండి! ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోండి. ఇప్పటిదాకా ఒక ఎత్తు. ఇప్పుడు ఒకెత్తు. ప్రాణం పెట్టి చదవండి. మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని నమ్ముకున్న ఆత్మీయుల స్వప్నాలను నిజం చేయ ండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న మీ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌. మీ ప్రయత్నాలు సఫలం కావాలని ఒక సోదరుడిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అని మంత్రి కేటీఆర్‌ యువతకు రాసిన ఆత్మీయ లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడకముందు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలు భర్తీ చేసిన ఉద్యోగాల నియామక ప్రక్రియపై సైతం ఎన్నో ఆరోపణలు, వివాదాలు నడిచాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతి ఒక ఉద్యోగాన్ని అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని గర్వంగా చెప్పగలను. ఎలాంటి వివక్షకు తావు ఉండరాదన్న ఉద్దేశంతో గ్రూపు-1 ఉద్యోగాలలోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికాం. అందుకే ఇప్పటిదాకా మా ప్రభుత్వం జరిపిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత అంశంపై ఎవరికీ ఎలాంటి అనుమానమూ లేదు.

అందుకే గతానికి భిన్నంగా ఇప్పటిదాకా ఈ అంశంపై ఒక వివాదమూ రాలేదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే గాక, ప్రైవేట్‌ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మా ప్రభుత్వం మెరుగుపర్చింది. ఇప్పటిదాకా సుమారు 17 లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత మన రాష్ట్రానిదే. ఇంతేకాకుండా అద్భుతమైన ఆవిషరణల ఆలోచనలతో ఉన్న ఔత్సాహిక యువత కోసం దేశంలో ఎకడాలేని విధంగా స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ను తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పరిచింది. వినూత్నంగా ఆలోచించే యువతకు అండగా ఉండేందుకు టీ-హబ్‌, టీ-వర్స్‌, వీ-హబ్‌, టీఎస్‌ఐఐసీ వంటి వేదికలను ఏర్పాటుచేసింది.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సూచన మేరకు దాదాపు నియోజకవర్గాలన్నింటిలో ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్న యువత కోసం టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగతస్థాయిలో కోచింగ్‌ సెంటర్లను, ఇతర వసతులను ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే లైబ్రరీల బలోపేతానికి సైతం కొన్నేండ్లుగా మా ప్రభుత్వం చేస్తున్న కృషి ఇవాళ ఫలించింది. నిరుద్యోగ యువత ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *