బీజేపీ పార్టీ అంటేనే జుమ్లా పార్టీ అని మండిపడ్డారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. బీజేపీకి, జేపీ నడ్డాకు అబద్ధాలు మాట్లాడటం అలవాటేనని, నడ్డా మర్రిగూడకు గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2016లో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మునుగోడు నియోజకర్గంలో పర్యటన సందర్భంగా చౌటుప్పల్‌లో ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, ఫ్లోరైడ్ బాధితులకు సాయం చేస్తామని, మర్రిగూడలో 300 పడకల దవాఖాన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఆ హామీల్లో జుమ్లాల బీజేపీ ప్రభుత్వం ఒక్కటైనా నెరవేర్చిందా అని మంత్రి కేటీఆర్ నిలదీశారు.
