ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం 2004 నుంచి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఓబీసీ సంఘాలు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిశాయని గుర్తుచేశారు. అయినప్పటికీ తమ డిమాండ్‌ను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఓబీసీ మంత్రిత్వ శాఖ కోసం ప్రధాని మోదీని కూడా కోరామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి, 2023 బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
