mt_logo

65 వేల సీడ్ బాల్స్ తయారు చేసిన చిన్నారిని అభినందించిన మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ మానసపుత్రికైన హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఓ బాలిక 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారు చేసి అడవిలో జల్లింది. సిరిసిల్ల జిల్లా సుద్దాలకి చెందిన ప్రకృతి ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ… తన పుట్టిన రోజు నాడు పర్యావరణహిత కార్యక్రమం చేయాలని, హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ తయారు చేసి సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తి వంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించి, స్వయంగా హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు. తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటి అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఈ కార్యక్రమం అనంతరం బ్లేస్సిని మంత్రి కేటీఆర్ వద్దకు స్వయంగా తీసుకెళ్లారు ఎంపీ సంతోష్ కుమార్. చిన్నతనం నుండే ప్రకృతి పట్ల ప్రేమను నింపిన బ్లెస్సీ తల్లిదండ్రులు ప్రకాష్, మమత ని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఏ అవసరమొచ్చినా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే తమ బిడ్డతో సీడ్ బాల్స్ తయారుచేయించామని బ్లెస్సీ తండ్రి ప్రకాష్ తెలిపారు. తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఆహ్వానించి మంత్రి కేటీఆర్ ను కలవడం… అలాగే గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనటం గొప్పవరంలా భావిస్తున్నామని ప్రకాష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *