mt_logo

రూ. 21.85 కోట్ల విలువైన దళితబంధు యూనిట్లను పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్

శుక్రవారం పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో దళిత బంధు కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని 233 మంది లబ్దిదారులకు రూ.21.85 కోట్ల విలువైన యూనిట్లను అందజేశారు. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద రూ. 26.50లక్షలతో 53 మందికి ఒక్కొక్కరికి రూ. 50వేల విలువైన కుట్టుమిషన్లను అందజేశారు. దళితులు సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ఎదిగి ఆర్థిక పరిపుష్టిని సాధించాలనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో బీజేపీ పాలిత అనేక రాష్ట్రాల్లో నీళ్లు లేక, కరెంటు లేక, ఉద్యోగాలు, ఉపాధి లేక జనం అల్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఏం చేయాలో కేంద్రం యోచించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *