mt_logo

అత్యాధునిక వసతులతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన

గ్రామీణ క్రీడలను ప్రోత్సాహించడంలో తెరాస ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా ఫిట్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. సూర్యపేట జిల్లా కేంద్రంలోని దూరజ్‌ప‌ల్లి వద్ద ఆరు ఎకరాల స్థలంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో అధునాతన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి శంకుస్థాప‌న‌ చేశారు. అనంతరం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్రామీణ యువత క్రికెట్ ను చాలా క్రేజ్ తో నేర్చుకుంటున్నారని, ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. క్రీడాకారులు ఎంచుకున్న క్రీడలో తప్పనిసరిగా తర్ఫీదు పొందాలని, తద్వారా గ్రామీణ క్రీడాకారులు అంత‌ర్జాతీయ స్థాయిలో రాణించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఇక్కడ నిర్మించ తలపెట్టిన స్టేడియంలో150 మంది క్రికెటర్లు ఏక కాలంలో బస చేయడంతో పాటు ప్రాక్టీస్ చేసుకునేలా నిర్మాణం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *