బుధవారం టీఆర్‌ఎస్ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజనల్ పూల్‌లోకి తేవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానే రాదన్న తెలంగాణ సాధించి, దేశంలో ఆదర్శ రాష్ట్రంగా సీఎం కేసీఆర్ నిలపారన్నారు. 14 సంవత్సరాలు పోరాడి ఎత్తిన పిడికిలి దించకుండా రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్‌ఎస్ అనీ, దేశంలోనే అతిచిన్న వయసు కలిగిన రాష్ట్రమైనా అన్ని రాష్ట్రాలకు దశ-దిశ చూపిందన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన ప్రగతిశీల ఎజెండా దేశానికి అవసరమని, పక్క రాష్ట్రాల నుంచి కేసీఆర్ ఎజెండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.
రైతుబంధు, దళితబంధు, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ తదితర పథకాలు మకు కావాలని పక్క రాష్ట్ర బీజేపీ నేతలు కోరుతున్నారని, సీఎం ఆలోచనలు, చిన్న పాలసీలు ఎన్నో గుణాత్మక మార్పునకు నాందిపలికాయన్నారు. పల్లె ప్రగతి, పట్ణ ప్రగతి అద్భుతమైన ఆలోచనతో స్థానిక సంస్థలను బలోపేతం చేసి, నిధులు, విధులు, ఉద్యోగాలు కల్పించి రూ.13వేల కోట్లు ఇస్తే దేశంలో సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద పదికి పది తెలంగా గ్రామాలు మొదటి స్థానంలో ఉన్నాయంటే ఎంత అభివృద్ధి, ఎంత అద్భుత ఫలితాలు సాధించామన్నారు. గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించామన్నారు. కేంద ప్రభుత్వ సిద్ధాంతం ఏంటంటే.. ‘కేంద్రం బలంగా ఉండాలి. రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనంగా ఉండాలి. రాష్ట్రాలకు అధికారాలను తగ్గించాలి’ ఇదే కేంద్రం సిద్ధాంతమన్నారు. రాష్ట్రాలు కేంద్రం చెప్పు చేతల్లో ఉండాలని చేస్తోన్న ప్రయత్నం ఇదని మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వానిది వైఫల్యాల చరిత్ర అనీ, తెలంగాణ ప్రభుత్వానిది సాఫల్యాల చరిత్ర అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో సాధించిన అద్భుత ఫలితాలు, ధరణి పోర్టల్‌తో భూ సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో కానే కాదనీ, గోదావరి నీళ్లు రావన్నారన్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పట్టుబట్టి రాత్రింభవళ్లు పని చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని నీళ్లు ఇస్తున్నామని, తెలంగాణ అంతా సస్యశ్యామలమైందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే 99లక్షల టన్నుల ధాన్యం పండితే ఇప్పుడు 2.50లక్షల టన్నుల దిగుబడి వస్తుందన్నారు. కేంద్రానికి వైఫల్యాల చరిత్ర అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మాటలు మాట్లాడుతుందని, ఏడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధి రేటుపడిపోయిందని, ఆ నాడు 8శాతం ఉంటే ఇవాళ 5.7శాతానికి పడిపోయిందన్నారు. బీజేపీ ధరలు పెంచి, మతకల్లోలాలు సృష్టించి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అచ్చేదిన్ అన్నారు.. కానీ ప్రజలకు చచ్చేదిన్ చేశారని ఆరోపించారు. నల్లధనం తెస్తామని చెప్పి.. రైతాంగానికి నల్ల చట్టాలు తెచ్చారని విమర్శించారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టారనీ.. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ.. ఊడగొడుతున్నారని మండిపడ్డారు. కొత్త పరిశ్రమలు తెస్తామని చెప్పి.. ఉన్న వాటిని అమ్ముకుంటున్నారని, బీజేపీ ప్రభుత్వం అమ్మిన ప్రభుత్వరంగ సంస్థల విలువ మూడున్నరలక్షల కోట్లని పేర్కొన్నారు. మోదీ చాయ్ అమ్మిండని.. బుల్లెట్ ట్రైన్లు తెస్తామన్నారని.. కానీ వాస్తవానికి రైళ్లు, రైల్వేస్టేషన్లు జరుగుతున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వం రాక ముందు నిరుద్యోగం 4.7 శాతం ఉంటే, ఏడేళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం 7.11 శాతానికి పెరిగిందన్నారు. పేదల అకౌంట్లలో డబ్బులు వేస్తామన్నారనీ.. జన్‌ధన్ ఖాతాలన్నారని, కానీ రూపాయి పేదలకు ఇవ్వలేదన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పి ఎరువుల ధరలు, డీజిల్ ధరలు పెంచారన్నారు. ఆదాయం పెరుగలేదని, పెట్టుబడి మాత్రం పెరిగేలా చేశారని విమర్శించారు. రైతుల ఉసురు పోసుకుంటన్నరి, బీజేపీ ప్రభుత్వం కార్మికులకు, ఉద్యోగులకు, కర్షకులకు, యువతకు, మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఏ వర్గానికి ఉపయోగపడిందని ప్రశ్నించారు. సంపద పెంచాలని, పేదలకు పెంచాలన్నది టీఆర్ఎస్ నినాదమన్నారు.