mt_logo

సిటీ కాలేజి శత వసంతాల వేడుకలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

హైదరాబాద్‌లోని సిటీ కళాశాల, తెలంగాణ భాషా సాంసృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన శత వసంతాల వేడుక కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక విద్యా సంస్థ వస్తే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, విద్య గొప్ప మార్పులకు కారణం అవుతుందని, ఇందుకు సిటీ కాలేజీ నిదర్శనం అన్నారు. వందేళ్ల కింద నిజాం స్థాపించిన ఈ కాలేజీ నుంచి ఎంతోమంది మేధావులు, విద్యావంతులు వచ్చారని… ఇపుడు వారంతా విద్య, రాజకీయ, పరిశోధన వంటి అనేక రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరారని కొనియాడారు. సిటీ కాలేజీ చదువుకు మాత్రమే కాదు.. సామాజిక ఉద్యమాలకు వేదిక అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ భవన పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వాటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సిటీ కాలేజిని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల సహాయం అందిస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే కాలేజీలో రూ.8కోట్లతో కొత్త బ్లాక్ ను ప్రభుత్వం నిర్మిస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *