mt_logo

అంతర్జాతీయ టేలర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణ మేరు సంఘం నిర్వహించిన ప్రపంచ టేలర్స్ డే వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, రవీంద్రభారతిలో ఫిబ్రవరి 28 ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… నేతన్న నేసిన వస్త్రాన్ని మనిషికి తగ్గట్టు అందంగా మలిచేది దర్జీలని, వారు కుట్టిన బట్టలతోనే హుందాతనం వస్తుందన్నారు. విలియమ్స్ హౌవో ఫిబ్రవరి 28న కుట్టుమిషన్ కనుగొన్న సందర్భంగా టైలర్లందరికీ గుర్తుంపు లభించిందని, ఈ సందర్భంగా మేరు కులస్థులకు, టైలర్లకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం చేయని విధంగా మేరు కులస్థులకు హైదరాబాద్లోని అత్యంత విలువైన ఉప్పల్ బగాయత్ లో ఎకరా స్థలంతో పాటు కోటి రూపాయలు సీఎం కేసీఆర్ కేటాయించారని గుర్తు చేశారు. బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నత వర్గాలకు దీటుగా బీసీ గురుకులాల్లో విద్యను అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ మేరు కులస్థులకు అండగా ఉంటామని, ఇంత గొప్పగా ఆదరణ చూపుతున్న ముఖ్యమంత్రిక కేసీఆర్ కు ప్రతీ ఒక్కరం రుణపడి ఉండాలన్నారు. ఈ సందర్భంగా మేరు కులస్థులకు ఎంతో సేవ చేస్తున్న మంత్రి . గంగుల కమలాకర్ ను బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, మేరు సంఘం తెలంగాణ అధ్యక్షులు కీర్తి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *