mt_logo

కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్

ఈ వానాకాలం కోటీ యాబై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో యాబై లక్షలు ఇతర అవసరాలకు తీసుకోగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో ప్రక్రియ ప్రారంభించామన్నారు సివిల్ సప్లైశాఖ మంత్రి గుంగల కమలాకర్. నేడు స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి కరీంనగర్ నియోజకవర్గంలోని నగునూర్, చామనపల్లి, చర్లబుత్కూర్, దుర్శేడ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించి వివరాలు వెల్లడించారు.

 2014కు ముందు కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే నేడు కోటిన్నర  మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంటకు అవసరమైన నీళ్లు, పెట్టుబడి, కరెంటు, ఎరువులు సకాలంలో అందించేలా సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలియజేశారు. గతంలో మార్కెటింగ్ చేసుకోవడంలోనూ రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇపుడు ఆ ఇబ్బందులు తీరి పోయాయని తెలియజేశారు. కేంద్రం మనల్ని నూకలు తినాలని చెబుతూ, ధాన్యం మేం కొనమని ఖరాఖండిగా చెప్పినా… రైతు పండించిన ప్రతీ గింజను కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. గతంలో శ్రీలంక లాంటి దేశాలు ఎదుర్కొన్న ఆహార సంక్షోభం చూసామని, కనీసం దాన్ని పట్టించుకోకుండా ముందు చూపు లేకుండా రైతుల పంటలపై చిన్నచూపుతో వ్యవహరించిన తీరుతో కేవలం ఆరు నెలల్లోనే కేంద్రం వద్ద నిల్వలు కొరత ఏర్పాడ్డాయని దుయ్యబట్టారు. బాబాసాహెబ్ చెప్పిన ఆహార భద్రతను గాలికొదిలి పూర్తి వ్యాపారిలా వ్యవహరించే కేంద్రం ఉండడం దురద్రుష్టమన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో భూమి మేయలేని విదంగా పంటను పండించామని, కానీ దీన్ని అడ్డుకునేవిదంగా ర్యాకు మూమెంట్ ఇవ్వకా, గోడోన్లు కేటాయించక, ఎఫ్.సి.ఐ వంటి సంస్థలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడం దారుణమన్నారు మంత్రి గంగుల.  

రాష్ట్ర వ్యాప్తంగా 6713 కొనుగోలు కేంద్రాల ప్రతిపాదించామని, ఇప్పటివరకూ 1545 కేంద్రాలు ప్రారంభించి దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల్ని సేకరించామని వీటికి సాదారణ రకం 2040, మేలురకం 2060 మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తామన్నారు, నిధుల కొరత లేదని, గన్నీలు, ప్యాడీక్లీనర్లు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లతో పాటు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు.  గతంలో కళ్లాలు ఉండి ఎప్.ఏక్యూ వచ్చేదని ఇప్పుడు నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తుండడంతో అక్కడ ప్యాడీక్లీనర్ల ద్వారా ఎఫ్.ఏ.క్యూ పాటించి ఒక్క గింజను సైతం తరుగు పెట్టే ప్రసక్తే లేదన్నారు. కానీ కొన్ని చోట్ల రైతులే స్వయంగా రెండు మూడు కిలోలు తరుగు పెట్టినా సరె ఎట్లుందో అట్ల తీసుకోవాలంటున్నారని తద్వారా మిల్లుల్లో తరుగుతీస్తున్నారని ఈ సారి అలాంటి వాటికి అనుమతించేది లేదన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 6313 మంది రైతుల దగ్గరనుండి సేకరించామని దీని విలువ దాదాపు 100 కోట్లుందన్నారు. గతంలోని 14 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తోనే రైస్ మిల్లులున్నాయని, 2300 మిల్లుల్లో నిరంతరాయంగా మిల్లింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. 

ప్రతీ ఏఈవో పరిధిలోని 5వేల ఎకరాలను పీపీసీ కొనుగోలు సెంటర్లలోని ట్యాబ్ లకు అనుసందానం చేసామన్న మంత్రి ఖచ్చితంగా ఆ ప్రాంతం పంటను ఎలాంటి షరతులు లేకుండా సేకరిస్తామని ప్రకటించారు. పక్క రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మద్దతు దరతో కొనడం లేనందున ఆ ధాన్యం తెలంగాణకు వచ్చే అవకాశం లేకుండా పకడ్బందిగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నియంత్రిస్తున్నామన్నారు. లారీ ట్రాన్స్ పోర్ట్ దారులు, రైస్ మిల్లర్లు పూర్తిగా సహకరించాలని విజ్ణప్తి చేసిన మంత్రి, స్టోరేజీ లేని చోట ఇంటర్మీడియట్ స్టోరేజీ ఏర్పాటు చేసామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *