mt_logo

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీస్కుంటున్నాం- ఈటల

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శాసనసభలో కరోనా వైరస్ పై చర్చను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కరోనా వ్యాపించకుండా మార్చి 14 న పాక్షిక లాక్ డౌన్ ను ప్రకటించామని, ఇండోనేషియా నుండి కరీంనగర్ వచ్చిన వారిని వెంటనే ఐసోలేషన్ చేశామని తెలిపారు. కరోనా పరిస్థితిని సీఎం కేసీఆర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారని, రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

ప్రస్తుతం రోజుకు 60 వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని, అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారికి హోం ఐసోలేషన్ లోనే చికిత్స అందిస్తున్నామని, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. కరోనా మరణాల్లో దేశంలో తెలంగాణ 12 వ స్థానంలో ఉంది. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నాం అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *