గుజరాత్ లోని బావ్ నగర్ లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు మనవాళ్లు మొత్తం 18 పతకాలు (7 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్యాలు) ఖాతాలో వేసుకొని పట్టికలో 14వ స్థానంలో కొనసాగుతున్నారు. గురువారం మహిళల బాస్కెట్‌బాల్‌లో మన అమ్మాయిలు పసిడి పతకం కైవసం చేసుకున్నారు. మహిళల 5X5 ఫైనల్లో తెలంగాణ 67-62తో తమిళనాడుపై విజయం సాధించింది. అంతకుముందు హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో మన అమ్మాయిలు 88-82తో కేరళను చిత్తుచేశారు.
కాగా బాస్కెట్‌బాల్‌లో పసిడి పతకం గెలిచిన బాలికలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.