అంతర్జాతీయ మేయర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం గం.2.45ని.లకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాష్ట్రపతికి బేగంపేట విమానాశ్రయం లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో మెట్రోపొలిస్ సదస్సు జరుగుతున్న హెచ్ఐసీసీ వద్దకు చేరుకొని రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. మూడు రోజులుగా నగరంలో జరుగుతున్న మెట్రో పొలిస్ సదస్సు సమావేశంలో కీలకోపన్యాసం చేసిన అనంతరం సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ వెళ్తారు.