తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో చాలాచోట్ల వాతావరణం చల్లబడి, వేసవి వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా… రేపు, ఎల్లుండి చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.