mt_logo

మాణిక్కం ఠాకూర్ అయోమయంలో ఉన్నారు: కేటీఆర్


తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌పై ఎక్స్‌లో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌పైన పరువు నష్టం దావా వేస్తానన్న మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. మాణిక్కం ఠాకూర్ అయోమయంలో ఉన్నారని అన్నారు.

మాణిక్కం ఠాకూర్ తోటి కాంగ్రెస్ నాయకుడు.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని అన్న మాటని కేటీఆర్ గుర్తు చేశారు.

పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన 50 కోట్ల రూపాయల లంచం వార్తలనే తాను ప్రస్తావించానని కేటీఆర్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఠాకూర్‌పై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని కేటీఆర్ గుర్తుచేశారు.

కోమటిరెడ్డి తాను చేసిన 50 కోట్ల లంచం వ్యాఖ్యలపైన వివరణ కూడా ఇవ్వలేదు.. ఠాకూర్ పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుంది అని పేర్కొన్నారు. పరువు నష్టం దావా తన చిరునామాకు కాకుండా.. ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండని కేటీఆర్ సూచించారు.