mt_logo

12 నుండి 15 సంవత్సరాల పిల్లలకి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించండి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 12 నుండి 15 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సీఎం కేసీఆర్‌ విద్యా వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని తెలియజేసారు. బుధవారం మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బాలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మంత్రి సబిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో 12 సంవత్సరాల పైబడిన పిల్లలు 15 లక్షలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వారందరికి వ్యాక్సిన్‌ వేయించడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు టీకా వేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ అన్ని రకాల చర్యలు తీసుకున్నారని, వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుస‌లో ఉందన్నారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని మార్గదర్శకంగా తీసుకుంటున్నాయని తెలిపారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది, అంగన్‌ వాడీ టీచరర్లు, ఆశవర్కర్లు, మున్సిపల్‌ సిబ్బంది ప్రతి ఇంటికి పోయి ఫివర్‌ సర్వే చేయడం వలన మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నాట్లు పేర్కొన్నారు. నగరంలో 250 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ఇంగ్లీష్‌ విద్యను అమలు చేయడం పై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *