ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో యాదగిరి గుట్టకు చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎం ఆలయ సింహద్వారం దగ్గరికి చేరుకోగానే వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారిని దర్శించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. యాదగిరి గుట్టలో స్వర్ణ గోపురం కట్టిస్తామని, గర్భగుడి ఎత్తును పెంచుతామని, రాబోయే రోజుల్లో భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్ లో గుట్టను అద్భుతంగా తీర్చిదిద్దుతామని, పెద్ద పార్కును, తిరుమల తరహాలో కాటేజీలు, ఆధ్యాత్మికత కేంద్రాలు నిర్మిస్తామని చెప్పారు. గుడి పరిసరాల్లో పందులు లేకుండా చూడాలని, శుభ్రత పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.