దేశంలో కుటుంబ పాలనకు ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ అని, టీఆర్ఎస్ పార్టీది ఉద్యమ కుటుంబమని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు. టీఆర్ఎస్ ది కుటుంబ పాలన అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యానించడం పట్ల బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ సభలకు వస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేకే టీఆర్ఎస్ పై అన్ని పార్టీలూ విమర్శలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ధాటికి కాంగ్రెస్ అధిష్టానం భయపడి దేశాన్ని వదిలి తెలంగాణలో తిరుగుతున్నారని, కేసీఆర్ ను చూసి కాంగ్రెస్ పార్టీ గడగడలాడుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ పాలనలో స్కాంల కాంగ్రెస్ గా మారిందని, 2004 నుండి అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదని? ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు, సింగరేణి కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.