mt_logo

మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

సిరిసిల్ల మండలం జిల్లెలలో మిషన్ కాకతీయ పనులను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందని, మిషన్ కాకతీయ పనులకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. చెరువుల్లో పూడిక మట్టిని రైతులు తీసుకెళ్ళి పొలాల్లో వేసుకోవాలని కేటీఆర్ సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్నామని, రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఖర్చయినా రైతులకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.

ఇదిలాఉండగా వాటర్ గ్రిడ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ఈరోజు రూ. 100 కోట్లు విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *