mt_logo

పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ పాదయాత్ర 

సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కి   మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రలో పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

పద్మారావు గౌడ్ అందరి వాడు.. మనందరికీ సుపరిచితుడు కాబట్టి.. కారు గుర్తుకు ఓటు వేసి పజ్జన్నను గెలిపించాలని కేటీఆర్ ఓటర్లను కోరారు.