తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచే విధంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కేటాయించిన ప్రదేశంలో రాహుల్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడంపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అదే స్థానంలో సగర్వంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం అస్తవ్యస్తంగా ఉండేదని, అగ్ని ప్రమాదం జరిగితే కూడా ఫైర్ ఇంజన్ రాని పరిస్థితి ఉండేదని, ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సచివాలయ పునర్నిర్మానం చేద్దామనుకున్నారు. తెలంగాణ పౌరుషం, తెలంగాణ వైభవాన్ని చాటేలా, తెలంగాణ భవిష్యత్తు తరాలకు అందించేలా అద్భుతమైన డిజైన్‌తో నిర్మాణం చేశామన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అద్భుతమైన నివాళి అందించేలా మహనీయుడి అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఆయన పేరును రాష్ట్ర సచివాలయానికి పెట్టామని తెలియజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని సచివాలయానికి పెట్టుకున్నమన్నారు.
సచివాలయంలో కూర్చుని పాలించే ప్రతి పాలకుడికి తెలంగాణ అమరవీరుల త్యాగాలని స్ఫూర్తిని జ్వలింపజేస్తూ.. స్ఫూర్తినిచ్చేలా ఒక అద్భుతమైన అమరజ్యోతి స్మారకన్నీ నిర్మించామన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతికైన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్టించాలన్న ఉద్దేశంతో ఒక ఐలాండ్‌ని సచివాలయం ఎదురుగా క్రియేట్ చేయడం జరిగిందని.. తెలంగాన దశాబ్ది ఉత్సవాల్లోనే అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ కుసంస్కార పార్టీ అని, అందుకే ఈరోజు తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతుందని విమర్శించారు. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారి పేరుతో ఉన్న పార్కు లుంబిని పార్క్ అయిందని, అదే అంజయ్య గారి పార్కు ఎదురుగా ఆయనను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారన్నారు.
గత పది సంవత్సరాలలో మేము ఏనాడు కూడా రాష్ట్రంలో పేర్ల మార్పు పైన ఆలోచించలేదన్నారు. అందుకే ప్రభుత్వ పథకాలకు, ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు ఉన్న వాటిని మార్చే ప్రయత్నం చేయలేదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీకి, రాజీవ్ గాంధీ స్టేడియం రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియం, రాజీవ్ రహదారి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా ఎన్ని పేర్లు ఉన్నా వాటిని మేము ఏనాడు మార్చనికి ప్రయత్నం చేయలేదనీ, కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత బాధతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ నుంచి తరలిస్తామన్న మాట చెప్పాల్సి వస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి రాగానే అక్కడి నుంచి తరలిస్తామని హెచ్చరించారు. వందలాదిమంది తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కకు పెట్టి రాహుల్ గాంధీ విగ్రహాన్ని పెడుతుందన్నారు.
మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మ గౌరవ పోరాటమని, మళ్లీ నాలుగేళ్లలో తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం వస్తుందన్నారు. ఈరోజు తెలంగాణ తల్లికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాన్ని తెలంగాన మరిచిపోదన్నారు. ఇప్పుడు పెడుతున్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి.. కాంగ్రెస్ పార్టీ కోరుకున్నచోటికి పంపిస్తామన్నారు. ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవానికి, అమరవీరుల త్యాగాలకు అవమానపరిచేలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోవాలి.
ఇప్పటికే రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ విగ్రహాలు సరిపోయినన్ని ఉన్నాయనీ, ఢిల్లీకి గులాములుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పౌరుషం కలిగిన బిడ్డగా చెబుతున్నమని వాటిని మార్చే దిశగా ఆలోచన చేస్తామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే ప్రాంతీయంగా తెలంగాణ మహనీయుడి పేరును హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడతామన్నారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని ఏనాడు అనడని, మహనీయుడు అంబేద్కర్‌కి కనీసం పూలదండ వేయడు, కనీసం లైటింగ్ ఏర్పాటు చేయని కుసంస్కారి అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రికి అధిష్టానం దగ్గర మెప్పు కావాలి అంటే, రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయాలి అంటే గాంధీభవన్‌లోనో, రేవంత్ రెడ్డి ఇంట్లోనో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలన్నారు.
- Revanth’s plan to utilize ‘Pharma City’ lands for his ‘Future city’ foiled
- Inordinate delay: Congress struggling to expand Telangana cabinet
- All time record: Revanth govt. makes Rs. 10,392 cr debt in July
- Defected BRS MLAs face uncertain future following High Court ruling
- BRS submits recommendations to 16th Finance Commission, seeks greater fiscal autonomy for Telangana
- నిన్న జరిగిన దాడికి కర్త, కర్మ, క్రియ రేవంత్ రెడ్డి: హరీష్ రావు
- బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు?: కేటీఆర్
- లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని డీజీపీ హామీ మేరకు సహకరిస్తున్నాం: హరీష్ రావు
- కౌశిక్ రెడ్డిపై దాడికి ఉసిగొలిపిన సీఐ, ఏసీపీని సస్పెండ్ చేయాలి: హరీష్ రావు
- సీతారాం ఏచూరి కృషి కారణంగా లక్షల కార్మికుల జీవితాలు బాగుపడ్డాయి: కేటీఆర్
- పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. ఇదేనా కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ?: హరీష్ రావు
- సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకికవాదానికి తీరని లోటు: కేసీఆర్
- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారా?
- పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా.. ఎటు పోతోంది మన రాష్ట్రం?: కేటీఆర్
- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయించడం దుర్మార్గమైన చర్య: హరీష్ రావు